12, జనవరి 2014, ఆదివారం

17, ఏప్రిల్ 2012, మంగళవారం

విరహమధురం

2 స్పందనలు

‎నీవు లేక నిదుర రాక,
కలలు అన్ని కాలరాసి,
విరహమంతా వత్తి చేసి,
కోరికంతా జ్వాల చేసి,
మనసునంతా దహించేసి,
నాలో నేను సమీరంలా,
పాటలాగా పరుగు తీసి,
నీలో కలిసే క్షణంకోసం,
చెలీ,
మధురమై నే ఎదురు చూసా...

వెన్నెల కలం నుండి..

నేను ప్రేమలో వున్నాను

1 స్పందనలు

"నువ్వు పక్కనుంటే చాలు, ఏదైనా సాధించగలను"
              అని చెప్పేవారు దొరికినప్పుడు,

"నిన్ను చూస్తూ అలా వుండిపోగలను"
              అని అనుకొనే సమయం వచ్చినప్పుడు

"నా ఆనందం నీ నవ్వులొ వుంది"
              అని నేను అనుకొంటున్నప్పుడు

              బహుషా నేను ప్రేమలొ వున్నాను.


వెన్నెల కలం నుండి..

6, అక్టోబర్ 2011, గురువారం

బాటసారి

0 స్పందనలు

ధరల అంపశయ్య మీద
భీష్ముడు  వాడు

సమస్యల కంటక కిరీటధారి వాడు

చావు  బ్రతుకుల మద్య వ్రేలాడే
గబ్బిలం వాడు

రోజుకో ఆశ చిగురించే
జీవికావల్లిక వాడు

కాలాగ్నిలో కరుగుతున్న
కలల్ని కనే
నిస్సంతు వాడు

ఇంకా అర్థం కాలా?
నేటి సామాన్య జీవి వాడు



శ్రీ అంజిబాబు గారి కలం నుండి..

9, ఆగస్టు 2011, మంగళవారం

కొన్ని మౌళికమైన (?) ప్రశ్నలు

1 స్పందనలు

ప్ర..నేను పుట్టిన దేశంలో నాతో పాటు అందర్ని సమానంగా చూడలేని రాజ్యాంగాన్ని ఇంకెంతకాలం భరించాలి?

ప్ర..నేను కడుతున్న పన్నుల లెక్క చెప్పలేని ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి నేనెందుకు ఓటు వేయాలి?

ప్ర. నేను, నా తరువాతి తరంవారు కాపాడుకోవాల్సిన నా ప్రకృతి సంపదను ఈ దేశ ప్రభుత్వానికి ఎవరు ధారాదత్తం చేసారు?

--------------------------------------------------

ప్ర.. నా సమాజం అందిస్తున ప్రత్యేక రిజర్వేషన్ల ఫలాల్ని తింటూ గింజల్ని మాత్రం నాటని వ్యక్తులు నా సమాజానికి చేస్తున్న టోకు మేలు ఏమిటి?

ప్ర. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టకుండా మనం ఇంకా ఎంత కాలం నిభాయించుకోగలం?

ప్ర. ఈ దేశ మూల వారసత్వాన్ని, వేదాల్ని, కళా సంసృతులను వేల ఏళ్ళ నుండి పరిరక్షిస్తున్న వర్గాలవారు ఇంకా ఎంత కాలం పాటు ఆ పని చేయగల సామర్థ్యంతో వున్నారు?

--------------------------------------------------

మీ...

22, జులై 2011, శుక్రవారం

పాఠాలు - గుణ పాఠాలు

2 స్పందనలు

ప్రతిదీ ఒక చోట మొదలై ,

                 ఎక్కడో  ఒక చోట పూర్తవ్వాలి.

అలా కానివి రెండున్నాయి. సంతృప్తి, అసంతృప్తి.

---------------------------------------------


ఆనందాన్నిచ్చే గమ్యాల వైపు పయనం,

             స్ఫూర్తినిస్తుంది, ఓర్పునిస్తుంది.

---------------------------------------------


కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి

       ఏం కావాలనుకోవాలి? ఏం వదులుకోవాలి?

    ఏం కావాలనుకుంటే ఏం వదులుకోవాలి?
    ఏం వదులుకుంటే ఏం వస్తుంది?

అవకాశాలతో ప్రయోగాలు చేయడమే జీవితం

---------------------------------------------


జీవితం ఎప్పటికప్పుడు కొత్తగా వుండాలనుకోవడంలో తప్పు లేదు

కేవలం అనుకుంటూ వుండడంలోనే తప్పు వుంది.

---------------------------------------------

ఈ రోజు కంటే రేపు మరింత బాగా ఆలోచించడమే వ్యక్తిత్వం.



మీ...

10, ఏప్రిల్ 2010, శనివారం

ప్రపంచం ముందరకెళ్తోంది.

1 స్పందనలు

officeలో సోమవారం నుండి గురువారందాకా ఎలా వున్నా శుక్రవారం మాత్రం కళ్ళకు ఇంద్ర ధనుస్సు పెట్టుకున్నట్లుంటుంది.

సౌమ్యంగా చెప్పాలంటే - సీతాకోక చిలుకల్ని అడవి మధ్యలో సెలయేరు పక్కన నిలబడి చూస్తున్నట్లుంటుంది.
నా మాటల్లో చెప్పాలంటే - ఈ జీవితానికిది చాలు, ఆడవులకెళ్ళి తపస్సు చేసుకుందామనిపిస్తుంది.
చంద్ర మౌళి మాటల్లో చెప్పాలంటే - పిల్ల కత్తిలా వుంది, పరిచయం పెంచుకుందామా అనేట్లుటుంది.

అసలు విషయానికి వస్తే నా పూర్వ జన్మలో నేను దూరదర్శన్ లో పని చేసేవాడిననుకుంటా. నా అవతారం మాత్రం జన్మ మారినా అలాగే వుండిపోయింది. ప్చ్.. అదేంటో నేను ఏం వేసుకున్నా పది వరకు పల్లెటూళ్ళో చదివి ఇంటరుకు పట్నాణికొచ్చిన పిల్లాడిలాగే వుటుంది. నేను చేసే పనిలో ఎంత సృజనాత్మకత వుటుందో, ఆహార్యం అంత దరిద్రంగా వుటుంది అని నా గట్టి నమ్మకం.

ఈ ఆత్మారాముని శల్య సారథ్యానికి తోడు, చుట్టూ సీతాకోక చిలుకలు.
ఇక చూస్కో, ప్రపంచం ముందరకెళ్ళిపోతోందిరా చంద్రమౌళి ఒకటే గొడవ.
సర్లే మనమూ ప్రపంచంతోపాటె నడుద్దాం అని ఈ మధ్యే కాస్త వేషం మార్చా. పరిస్థితి కాస్త మెరుగు.

కాని ఈ రోజు, మారిన నా అభిప్రాయాన్ని మళ్ళీ మార్చుకొనే సంఘటన జరిగింది.
ఎప్పుడు జీన్స్ వేసుకునే అమ్మాయి ఈ రోజు చీర కట్టుకొనొచ్చింది.
చంద్ర మౌళి మనసు వెంటనే సౌమ్యంగా అయిపోయింది.
అందాన్ని కేవలం కళ్ళతో అనుభవించడానికి, మనసుతో కలిపి ఆస్వాదించడానికి మద్య ఎంత దూరమో తెలిసిపొయింది.

ముఖ్యంగా వేషాన్ని కొత్తగా మార్చకోవడం కాకుండా, ఆలోచనల్ని నవ్యంగా వుంచుకుంటే జీవితం దివ్యంగా వుంటుందనిపించింది.
ప్రపంచం ఎంత ముందరికెళ్ళినా, మన సాంప్రదాయం సోయగం తగ్గదనిపించింది.

నప్పని కొత్త style కన్నా , నచ్చే dignified నాకు సరిపోతుందనిపించింది.